సైమా అవార్డుల కోసం పోటీ పడుతున్న నాలుగు భాషా చిత్రాలు

Update: 2023-08-02 07:07 GMT

సౌత్ ఇండియాలో అతి పెద్ద అవార్డుల పండుగ సైమా. ఈ సారి సైమా అవార్డుల ఫంక్షన్ దుబాయ్ లో జరగనుంది. సెప్టెంబర్ 15, 16 తేదీలలో జరిగే అవార్డుల కోసం తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్, సీతారామం సినిమాలు అత్యధిక నామినేషన్లతో పోటీ పడుతున్నాయి.

సౌత్ కి చెందిన నాలుగు భాషల సినిమాలకు సైమాలో అవార్డులు ఇస్తారు. సౌత్ మొత్తానికి అవార్డులు ఇవ్వడంతో పాటుగా ఆయా భాషల వారీగా కూడా ఉత్తమ అవార్డుల నిఇస్తారు. ఈ వేడుకలకు దాదాపు అందరూ హాజరవుతారు కూడా. 2023 అవార్డులకి గాను ప్రస్తుతం పోటీ జరుగుతోంది.దీనికోసం ఇప్పటికే నాలుగు భాషల లో సినిమాలు వివిధ కేటగిరీల లో నామినేషన్స్ కి పోటీ పడుతున్నాయి. తెలుగు లో పాన్ ఇండియా సినిమాలైన ఆర్ఆర్ఆర్ 11 విభాగాల లో పోటీలో ఉండగా... సీతారామం 10 కేటగిరీల లో సవాలు విసురుతోంది.

ఈ రెండు సినిమాలతో పాటూ డీజే టిల్లు, కార్తికేయ 2 బెస్ట్ మూవీస్ కేటగిరీలో రేసు లో ఉన్నాయి. ఇక తమిళం నుంచి మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ 10 విభాగాల లో అవార్డుల కోసం రేసు లో ఉంది. లోకేష్ కనగరాజ్ విక్రమ్ తొమ్మిది కేటగిరీల లో అవార్డుల కోసం పోటీ పడుతోంది. ఉత్తమ తమిళ సినిమా విభాగం లో పీసీ-1, విక్రమ్ తో పాటు లవ్ టుడే, తిరుచిత్రంబలం, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాలు పోటీపడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి కాంతారా, కేజీఎఫ్ చాప్టర్ 2 లు 11 విభాగాల లో అవార్డుల కోసం నామినేషన్స్ లో ఉన్నాయి. కాంతారా, కేజీఎఫ్ చాప్టర్ 2, 777 చార్లీ, లవ్ మాక్‌టెయిల్ 2, విక్రాంత్ రోనా ఉత్తమ కన్నడ మూవీ కేటగిరీ లో పోటీ పడుతున్నాయి.

ఇక మలయాళం నుంచి మమ్ముట్టి భీష్మ పర్వం 8 కేటగిరీల నామినేషన్ లో పోటీలో ఉంది. దీని తర్వాత టోవినో థామస్ తల్లుమాల 7 విభాగాల లో అవార్డుల కోసం పోటీ పడుతోంది. భీష్మ పర్వం, తల్లుమాల, హృదయం, జయ జయ జయ హే, జన గణ మన, తాన్ కేస్ కొడు ఉత్తమ మలయాళ చిత్రం అవార్డ్ కోసం రేసు లో ఉన్నాయి. ఈసారి అవార్డుల ఫంక్షన్ కు తెలుగు నుంచి రానా, మృణాల్ ఠాకూర్ హోస్టింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News