ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్ లో ఒకరు సౌత్ క్వీన్ త్రిష. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ.. మళ్లీ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. అయితే త్రిష పెళ్లి వార్తలు ఎప్పుడూ వస్తుంటాయి. వాటిని పట్టించుకోని త్రిష.. తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే తాజాగా త్రిష పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో.. త్రిష సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలామంది వీడియో గ్లింప్స్ చూసి నిజంగానే త్రిష పెళ్లైపోయిందా అని షాక్ కు గురయ్యారు. ఇది చూసి త్రిష నిజంగానే పెళ్లి చేసుకుంది అనుకుంటే పొరపాటే.
ఇటీవల త్రిష జీఆర్టీ జువెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. జీఆర్టీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన యాడ్లో తాజాగా నటించింది. ఆ యాడ్ సీన్స్ లో క్లిప్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. పట్టు బట్టలతో, ఒంటి నిండా నగలతో త్రిష పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తుంది. పెళ్లి కూతురు గెటప్ లో, రాయల్ లుక్ లో కనిపిస్తున్న త్రిష ఆ యాడ్ లో పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోనే వైరల్ అవుతోంది.