టాలీవుడ్, బాలీవుడ్లో ప్రస్తుతం సమంత హవా నడుస్తోంది. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో మునిగిపోయింది ఈ స్టార్ బ్యూటీ. ఓవైపు ముంబైలో సీటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు విజయ్‌తో ఖుషీ ఖుషీగా సినిమా చేసేస్తోంది. షూటింగ్‌లతో సమంత ఫుల్ బిజీగా ఉన్నా, తన ఫాలోవర్స్‌ని మాత్రం మరిచిపోవడం లేదు. వీలు దొరికినప్పుడల్లా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటోంది. తాజాగా సమంత తన జిగిరీ దోస్త్ రాహుల్ రవీంద్రన్ గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.
రాహుల్ రవీంద్రన్ టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న పిక్ షేర్ చేస్తూ.." మీకు తెలిసిన మంచి వ్యక్తిని వందసార్లు మల్టిప్లై చేస్తే నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటాను. తను ఫుడీ అయినప్పటికీ, మనకి కంపెనీ ఇవ్వడానికి దాన్ని కూడా పాపం వదులుకుంటాడు. కానీ ఎంత బాధపడతాడో"అంటూ సరదాగా పోస్ట్ షేర్ చేసింది సామ్.
యాక్టర్ రాహుల్, సింగర్ చిన్మయి ఇద్దరూ సమంతకు బెస్ట్ ఫ్రెండ్స్ . ఇది అందరికీ తెలిసిన విషయమే .రాహుల్, సామ్ కలిసి తమిళంలో ఓ సినిమా కూడా చేశారు. అప్పటి నుంచే రాహుల్ , సామ్ మంచి స్నేహితులయ్యారు. ఆ తరువాత సామ్ సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పడంతో చిన్మయి కూడా సామ్‌కి బాగా క్లోజ్ అయింది.