ముగ్గురు అబ్బాయిల కథతో వస్తున్న ‘శ్రీ‌రంగ‌నీతులు’.. ట్రైల‌ర్‌ రిలీజ్

Byline :  Shabarish
Update: 2024-03-29 09:53 GMT

టాలీవుడ్ యువ హీరోలు సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, హీరోయిన్ రుహానీ శర్మ నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు. డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దంగా ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఈ టూవీ ట్రైలర్ సాగుతుంది.

ప్రేమించిన అమ్మాయి కోసం ఒకడు, వ్యసనాలకు అలవాటుపడిన వాడు ఇంకొకడు, ఫేమస్ అవ్వాలనుకునేవాడు మరొకడు. ఈ ముగ్గురు జీవితాల గురించే ఈ మూవీలో స్టోరీ రన్ అవుతుంది. ట్రైలర్‌లో ముగ్గురి సీన్స్‌ను విడివిడిగా కట్ చేసి చూపించారు. సహజంగా సాగే మాటలు, ఎమోషన్స్ సీన్స్ మధ్య ట్రైలర్ సాగింది. ఏప్రిల్ 11న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ట్రైలర్ చివర్లో అనౌన్స్ చేశారు.

హర్షవర్ధన్ రామేశ్వర్, అజయ్ అరసాడ మ్యూజిక్ బావుంది. మొత్తంగా ట్రైలర్ చూస్తే.. తమను తాము ఐడెంటిఫై చేసుకునే ముగ్గురు యువకుల స్టోరీ అని తెలుస్తోంది. శ్రీరంగనీతులు మూవీ ట్రైలర్ అన్ని వర్గాల ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

Full View

Tags:    

Similar News