బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టిన స్టార్ యాంకర్

Byline :  Aruna
Update: 2023-09-11 08:28 GMT

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన మాట కాస్త కటువుగా ఉన్నా..మనసు మాత్రం వెన్న అని అంటుంటారు. బాలయ్యతో ఒక్కసారి పని చేస్తే చాలు .. అయన గొప్పతనం గురించి 100 చెబుతూ ఉంటారు. చాలామందికి ఆయన్ని చూస్తే భయం. కానీ అయనకు దగ్గరైన వారికి మాత్రం ఆయనంటే గౌరవం. ఎవరైనా అయన గొప్పతనానికి , మనస్తత్వానికి ఫిదా అవ్వాల్సిందే అని అంటారు. ఇండస్ట్రీలోని వారికి ఆయన ఏ సాయం కావాలన్నా అందిస్తారు. ఇప్పటి వరకు ఎంతోమందికి సాయం చేశారు..ఇంకా చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ మాజీ యాంకర్ నటి అనితా చౌదరి బాలకృష్ణ గొప్పతనం ఏంటో మరోసారి తన మాటల్లో బయటపెట్టింది. ఓవైపు యాంకరింగ్‎లో రాణిస్తూనే , సీరియల్స్, సినిమాల్లోనూ నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న అనిత చౌదరి గతంలో బాలయ్య చేసిన సాయాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది. " నా జీవితంలో రెండు యాక్సిడెంట్స్ జరిగాయి. ఒకప్పుడు ఓ ట్రక్ మా కారును గుద్దేసింది. ఈ ప్రమాదంలో నా కాలర్ బోన్ విరిగిపోయింది. అప్పుడు ఎలాగోలాగా కోలుకున్నాను. అయితే కేరింత సినిమా సమయంలో మరో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది . ఆ యాక్సిడెంట్‎లో నా డిస్క్ విరిగింది. ఆ టైంలో అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందామని అనుకున్నాను . కానీ బాలకృష్ణ గారు ఇక్కడే దగ్గరుండి ట్రీట్మెంట్ అందించారు. అంతేకాదు స్వయంగా హాస్పిటల్‎కి డాక్టర్స్‎ను తీసుకొచ్చి మరి చికిత్స చేయించారు అని ఆయన గొప్పతనం ఏంటో చెప్పుకొచ్చింది .

నా అభిమాని ఒకరు బాలకృష్ణ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె బాలకృష్ణ గారికి నా యాక్సిడెంట్ గురించి చెప్పింది. బాలకృష్ణ వెంటనే స్పందించారు. . నా భర్త అమెరికాలో ఉంటే ఆయనతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. నాకు ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించారు. సాయం చేయాలంటే అంతగా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు అని బాలయ్య నిజస్వరూపం ఎలాంటిదో బయటపెట్టారు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు..నా లైఫ్ ఇక అయిపోయిందని చాలా మంది జోక్స్ వేసేవారు. ఆ సమయంలో కృష్ణవంశీ గారు చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అయితే కొన్ని కారణాలవల్ల చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ మిస్ చేసుకున్నాను. ఇక తాజాగా అనిత చౌదరి చెప్పిన మాటలని బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇదిరా మా బాలయ్య అని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News