బిగ్ బాస్ ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే వార్త వచ్చింది. గత కొంత కాలంగా వస్తున్న గాసిప్ వార్తలకు తెరదించుతూ స్టార్ మా అప్ డేట్ ఇచ్చింది. నాగార్జునను హోస్ట్ గా ప్రకటిస్తూ.. ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ‘కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్’ అంటూ మొదలైన ఈ ప్రోమో చూస్తుంటే.. ఈ సీజన్ కాస్త కొత్తగా ఉంటుంది అన్నట్లు కనిపిస్తుంది. అన్ని సీజన్లకు మించి దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. దీన్ని బట్టి త్వరలోనే సీజన్ ను కూడా మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.