కరోనా లాక్‌డౌన్ నుంచి ఇప్పటివరకూ ఎంతో మందికి తన వంతు సహాయాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఓ పక్క ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం తన ఫాలోవర్స్‌కి అదుబాటులో ఉంటూ అందరితో టచ్‌లో ఉంటుంటారు. వీలైనంత వరకు తమకు సహాయం కావాలని ఎవరు అడిగా కాదనకుండా వీలైనంత హెల్ప్ చేస్తున్నారు. అందుకే సోనూసూద్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందులోనూ యూత్ ఎక్కువగా ఈయన్ని అభిమానిస్తుంటారు.
ప్రస్తుతం సోనూసూద్ MTV రోడీస్ సీజన్ 19 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కూడా ఉంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బిజీ షెడ్యూల్ అనంతరం సెట్‌లో ఉన్న వారి కోసం సోనూసూద్ ప్రేమగా దోశెలు వేసి వారిని ఎంటర్టైన్ చేశారు. ఎవరెవరికి ఎలాంటి దోశె కావాలో అడిగి మరీ సోనూ వడ్డించారు. ఇదే టైంలో రియా చక్రవర్తి కూడా ఆమె కోరినట్లు దోశెను సిద్ధం చేసి ఇచ్చారు సోనూసూద్ . దోశెలు వేసిన వీడియో సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ సోనూసూద్ సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. అందుకే మీరంటే మాకు గౌరవం అంటూ కామెంట్లు చేశారు.
కానీ ఈ వీడియోపై బాలీవుడ్ దివంగత యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ మాత్రం కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు. రియా చక్రవర్తికి దోశెలు వేసి ఇవ్వడం మాకు ఏమాత్రం నచ్చలేదని కామెంట్లు పెడుతున్నారు. దయచేసి ఆమెకు దూరంగా ఉండాలని సోనూను సుశాంత్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో నటి రియాపై ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు కొంతకాలం పాటు రియా జైలులో కూడా గడిపింది. అందుకే వారు సోనూసూద్‌కు ఈ సలహా ఇచ్చారు.