అలియా భట్ యాక్టింగ్‌కు సుధామూర్తి ఫిదా..

ఆలియా ఏడిపించింది;

By :  Lenin
Update: 2023-07-24 02:20 GMT


ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మంచితనం, మానవత్వం ఉన్న మనిషి. ఇప్పటికే పలు అనాథాశ్రమాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్ధికి సహకరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంగ్లీష్​ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలో సినిమాల గురించి తన కుటుంబంతో మరియు స్నేహితులతో చర్చిస్తుంటామని... ఒకవేళ తాను ఇంజనీర్‌ కాకపోయి ఉంటే సినీ క్రిటిక్ గా ఉండేదాన్నని చెప్పారు."థియేటర్లలో తొలిసారిగా 1958లో సినిమా చూశా. అప్పటి నుంచి వైజయంతీమాలను అభిమానించడం ప్రారంభించాను. ఇక నర్గిస్‌ నటననూ ఇష్టపడతాను. ఈతరంలో అయితే అలియా భట్‌ నటనను అభిమానిస్తాను. ఆమె గ్రేట్‌ యాక్టర్‌" అని పేర్కొన్నారు.

సినిమాల్లో ఎమోషనల్​ సీన్స్​ చూసి తానెప్పుడూ కంటతడి పెట్టుకోలేదని.. కానీ 'రాజీ' సినిమాలోని అలియా నటనకు ఏడ్చేశానంటూ సుధా మూర్తి తెలిపారు. తరచూ సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్‌, సంగీతం గురించి తమ ఇంట్లో చర్చించుకుంటుంటామని చెప్పారు. ఇక సినిమా విషయానికి వస్తే.. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'రాజీ' సినిమాలో అలియా భారత్​ కోసం పనిచేసే ఓ గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 190 కోట్లకు మేర వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా 64వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లోనూ 15 నామినేషన్లలో పోటీ పడిన ఈ సినిమా అందులో 5 అవార్డులు దక్కించుకుంది. వాటిల్లో ఉత్తమ నటి పురస్కారం కూడా ఒకటి కావడం విశేషం


Tags:    

Similar News