Mama Mascheendra : ఆసక్తికరంగా మామా మశ్చీంద్ర ట్రైలర్.. మూడు గెటప్పులతో..

By :  Krishna
Update: 2023-09-27 13:47 GMT

సుధీర్ బాబు.. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఇప్పటికే పలు ప్రయోగాలతో సినిమాలు తీసిన సుధీర్.. ఇప్పుడు సరికొత్త ప్రయోగంతో మామా మశ్చీంద్ర అనే మూవీ చేస్తున్నారు. నటుడు, రచయిత హర్షవర్ధన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూడు గెటప్పుల్లో సుధీర్ బాబు కన్పించనున్నారు.

ఈ మూవీ ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు. ఈ మూవీ అదిరిపోయే సక్సెస్ సాధించేలా ఉందని మహేష్ అన్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఓల్డ్ మ్యాన్గా.. ట్విన్స్ పాత్రలతో సుధీర్ బాబు ఇరగదీశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఓల్డ్ మ్యాన్కు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిద్దరూ కవలలను ఇష్టపడుతారు. ఇది నచ్చని ఓల్డ్ మ్యాన్ ఏంచేశాడన్నదే ఈ మూవీ స్టోరీ అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మహేష్ కంగారు పడ్డారని సుధీర్ బాబు చెప్పారు. ‘‘ఈ మూవీలో మూడు గెటప్పుల్లో కన్పిస్తానని , ఓ పాత్ర కోసం బాగా బరువు పెరగాలని, దానికోసం టైం తీసుకుని మరీ తినాలకుంటున్నాని చెప్పాను. దాంతో మహేష్ కంగారు పడ్డాడు. కానీ తర్వాత పలు సలహాలు ఇచ్చాడు. గతంలో అలాంటి పాత్ర పోషించిన వారి గురించి వివరించాడు’’ అని సుధీర్ బాబు తెలిపారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్‌ మ్యూజిక్ అందిస్తుండగా.. పీజీ విందా సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.


Full View


Tags:    

Similar News