శృంగార తార సన్నీలియోన్ గురించి చెప్పక్లర్లేదు. నీలిచిత్రాలు ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుసంపాదించిన సన్నీలియోన్..తర్వాత బాలీవుడ్ ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. అలా అన్ని భాషల్లో నటించి కుర్రకారును షేక్ చేసింది. ఈ అందాల తార తెలుగులో కూడా మెరిసింది. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ సినిమాలో నటించిన సన్నీలియోన్..తర్వాత గరుడవేగలోని సన్నీ..సన్నీ పాటకు ఇరగదీసింది. ఇటీవల మంచు విష్ణు పక్కన జిన్నా సినిమాలో కూడా కనిపించింది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు సన్నీలియోన్ యాక్టివ్ గానే ఉంటాది. ఫోటోలు షేర్ చేయడంతో పాటు అప్పుడప్పుడు కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన భర్త మోసం చేశాడంటూ సన్నీలియోన్ ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్ తో కలిసి దుబాయి వెకేషన్‌లో సన్నీలియోన్ ఉంది. ఈ క్రమంలోనే రూమ్ లో భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసి వీడియో తీసింది. దానిని ఇన్ స్టాలో పోస్టు చేస్తూ 'నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సన్నీలియోన్ పోస్ట్ వైరల్గా మారింది.