Sunny Leone : బాలీవుడ్ నటి పేరుతో హాల్ టికెట్.. కేసు నమోదు

Update: 2024-02-18 05:17 GMT

ఉద్యోగ నియామకాలకు పోటీ పరీక్షలు జరుగుతాయి. అయితే అందులో తప్పులు అప్పుడప్పుడూ దొర్లుతూ ఉంటాయి. హాల్ టికెట్లపై పేరు తప్పుగా పడుతుండటం, అలాగే ఒక ఫోటోకు బదులు మరొకరి ఫోటోను ఉంచడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు అంతకుమించి ఓ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ హాల్ టికెట్ బయటపడింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్‌ను అధికారులు అవాక్కయ్యారు.

బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుపై ఆ హాల్ టికెట్ జారీ అయ్యింది. ఆ హాల్ టికెట్‌పై ఆమె పేరు, ఫోటో వివరాలు కూడా ముద్రించి ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 17న పరీక్ష ఉందని అడ్మిట్ కార్డుపై ఉంది.

ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (UPPRB) వెబ్‌సైట్‌లో కొందరు ఆకతాయిలు కావాలనే సన్నీలియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేశారని అధికారులు గుర్తించారు. అడ్మిట్ కార్డు ప్రకారం సన్నీలియోన్ పరీక్షా కేంద్రం కన్నౌజ్‌ జిల్లాలోని తిర్వా తహసిల్‌లో ఉందని, సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉంది. ఈ ఘటనపై కన్నౌజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టిందని, ఘటనకు కారణమైనవారిని వదిలిపెట్టేది లేదని పోలీసులు తెలిపారు. 



Tags:    

Similar News