అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ సందీప్ వంగా యమ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీర్ రణ్బీర్ కపూర్తో తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 రిలీజ్ కానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్గా రష్మిక చేస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం జరగనుంది. దీన్నికోసం స్పెషల్ గెస్టులు వస్తున్నారు.
యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్టులుగా ఎవరు వస్తారనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. దీనికి మేకర్స్ సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా రానున్నారు. వీరిద్దరూ ఒకే వేదికపై కన్పించనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేష్ - రాజమౌళి కాంబినేషన్లో ఓ మూవీ రానుంది. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కథపై రాజమౌళి కసరత్తు చేస్తున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తైన తర్వాత రాజమౌళితో సినిమా చేస్తారు.
మహేష్ బాబుతో మూవీపై డైరెక్టర్ సందీప్ వంగ కూడా స్పందించారు. మహేశ్‌బాబుకి ఇప్పటికే ఓ కథ చెప్పానని.. అది ఆయనకు కూడా బాగా నచ్చిందని సందీప్ చెప్పారు. ‘‘ మహేష్ బాబుకు ఓ కథ చెప్పారు. ఆయనకు అది ఎంతో నచ్చింది. కాకపోతే ఆయనకు వేరే ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల మా సినిమా పట్టాలెక్కలేదు. ప్రభాస్, అల్లు అర్జున్‌తో సినిమాలు కంప్లీట్ అయ్యాక మహేష్, రామ్‌చరణ్‌తోపాటు చాలామంది హీరోలతో సినిమాలు చేయాలని ఉంది’’ అని సందీప్ అన్నారు. ఇక ప్రభాస్తో పాటు తాను తీయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జూన్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.