మహేష్‎కు రావాల్సింది బన్నీ కొట్టేశాడా?

Update: 2023-08-26 10:12 GMT

మొట్టమొదటిసారి ఓ తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ వార్త తెలిసినదగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని బన్నీఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. నేషనల్ వైడ్ పుష్ప, అల్లు అర్జున్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. కేవలం 20 ఏళ్ళల్లో 69 ఏళ్ళ తెలుగు సినిమా కలను నెరవేర్చిన హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు.

బన్నీ ఇన్నాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. అయితే ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు గతంలో చేసిన ఓ ఓల్డ్ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‎పైన నెట్టింట్లో ఓ పెద్ద చర్చే నడుస్తోంది. బన్నీకి రావాల్సిన అవార్డు నిజానికి మహేష్ బాబుకు రావాల్సిందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

వాస్తవానికి సుకుమార్ పుష్ప1, పుష్ప2 సినిమా స్టోరీలను సూపర్ స్టార్ మహేష్ కోసం రాశాడు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకుంటున్నట్లు సూపర్ స్టార్ అప్పట్లో ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో సుకుమార్ బన్నీకి కథ వినిపించాడు. అల్లు అర్జున్ ఓకే అనడంతో పట్టాలకు ఎక్కించాడు. మరి పుష్ప ఏ రేంజ్ లో ఇండస్ట్రీలో సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆల్ ఇండియా వైడ్ బన్నీకి వచ్చిన ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ ఒక్క సినిమాతో బన్నీ తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ సాధించలేని రికార్డ్ సృష్టించాడు. తన ఐకానిక్ స్టార్ పేరుకు న్యాయం చేశాడు. ఒకవేళ సుకుమార్ కోరుకున్నట్లే ఈ సినిమాలో మహేష్ నటించి ఉంటే ఆ నేషనల్ అవార్డు ప్రిన్స్‎కే వచ్చేదని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



Tags:    

Similar News