జవాన్‎పై మహేశ్ బాబు రివ్యూ..షారుక్ గురించి ఏమన్నాడంటే...

Byline :  Aruna
Update: 2023-09-08 09:03 GMT

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన పాన్ ఇండియా మూవీ జవాన్ థియేటర్లలో విడుదలై విజయవంతంగా దూసుకెళ్తోంది. మూవీ రిలీజ్ అయిన తొలిరేజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్‏తో పాటు సినీ అభిమానులు షారుక్ సినిమాకు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీలు సైతం జవాన్ సినిమాను పొగడ్తలతో ముంచేస్తున్నారు. తాజాగా ఈ మూవీ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. విడుదలైన రోజే తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు మహేశ్. ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసి జవాన్‎పై తన అభిప్రాయాన్ని తెలిపారు. మహేశ్ బాబు జవాన్‎కు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చారు.




 


" జవాన్‌ మూవీ బ్లాక్‌ బస్టర్‌ . డైరెక్టర్ అట్లీ కింగ్‌ సైజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. షారుక్‌ ఖాన్‌ తన సినీ కెరీర్‌లోని బెస్ట్‌ మూవీస్‎లో జవాన్ కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలో షారుక్‌ పెర్ఫార్మెన్స్ అదుర్స్. తన యాక్టింగ్‎తో సినీ లవర్స్‎ను ఆకట్టుకున్నారు. కచ్చితంగా జవాన్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుంది’’ అని మహేశ్ ట్విటర్ వేదికగా జవాన్‎పై బ్లాక్ బస్టర్ రివ్యూ అందించారు. అంతే కాదు కింగ్ ఖాన్‎ను లెజెండ్‌ అని సంభోదించి పొగడ్తలతో ముంచేశారు.




 









 


Tags:    

Similar News