మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు..వైసీపీకి రజినీకాంత్ కౌంటర్ ?

Update: 2023-08-08 16:30 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 70 ఏళ్ల వయస్సులోను అభిమానులను అలరిస్తున్నారు. మరోసారి జైలర్ సినిమాతో ముందుకొస్తున్నారు. ఈనెల 10వ తేదిన జైలర్ స విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా ఆడియో లాంచ్ ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో రజినీ కాంత్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఫుల్ జోష్ మాట్లాడుతూ తలైవా కొట్టిన డైలాగ్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. "మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి’.. ఇదంతా తమిళంలో చెప్పిన రజనీకాంత్, ఆఖరిలో ‘అర్థమైందా రాజా?’ అని మాత్రం తెలుగులో చెప్పారు. అయితే, ఇది వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేస్తు చెప్పారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగతోంది. టీడీపీ, జనసేన శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వంపై కామెంట్స్ చేయడం, చిరుకి వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో రజినీకాంత్ వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమైంది.

రజినీకాంత్ vs వైసీపీ

ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం చంద్రబాబు అని కొనియాడారు. అతని నాయకత్వం ఏపీ అవసరమని చెప్పారు. దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రజినీకాంత్ పై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై రజనీకాంత్ ఎక్కడా స్పందించలేదు.



Tags:    

Similar News