తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండింగ్ లో ఉంది. తను చేసిన రెండు వెబ్ సీరీస్ లలో హాట్ గా నటించడంతో ఎక్కడ చూసినా తమన్నే పేరే వినిపిస్తోంది. దాంతో పాటూ తన బాయ్ ఫ్రెండ్ గురించి కూడా అందరితో చెప్పేసి...హాట్ టాపిక్ గా నిలిచింది.
జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2....తమన్నా నటించిన రెండు వెబ్ సిరీస్ లు. ఈ రెండింటిలోనూ తమన్నా హద్దులు దాటిన శృంగారసన్నివేశాల్లో నటించింది. ఎప్పుడూ ఆమెను ఇలా చూడని జనాలు...ఒక్కసారిగా చూసేసరికి షాక్ అయ్యారు. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడికెళ్ళినా దీని గురించే అడుగుతుండడంతో చాలా అసహనంగా ఉంది. ఈ జనరేషన్ కూడా నన్ను వ్యతిరేకిస్తారని తాను అనుకోలేదని తమన్నా వాపోతోంది. హీరోలు చేస్తే లేని ఇబ్బంది హీరోయన్లు చేస్తే ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తోంది. హీరో లు ఎలాంటి పాత్రలు వేసినా సూపర్ స్టార్స్ ను చేస్తతారు. హీరోయన్లను మాత్రం విమర్శిస్తారు. ఇదెక్కడి న్యాయమో అర్ధం కావడం లేదంటూ మండిపడుతోంది మిల్కీ బ్యూటీ.
మరోవైపు ఎన్నాళ్ళుగా దాస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సంగతిని మొత్తానికి బయటపెట్టేసింది. లస్ట్ స్టోరీస్ చేస్తున్నప్పుడు విజయ్ వర్మ, తాను దగ్గర అయ్యామని చెప్పింది. అతనిలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం తన అదృష్టమని చెప్పింది. ఇంట్లో మహిళను గౌరవించేవ్యక్తి, బయటవాళ్ళను కూడా గౌరవిస్తాడు. విజయవర్మకు తన ఇంట్లో ఆడవాళ్లంటే ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చింది. తన భావాలకు విజయవర్మ రెస్పెక్ట్ ఇస్తాడని చెప్పింది. ఆడవాళ్ళతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు వారికొడుకులను నేర్పాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీపడాలనే భావనను తాను అంగీకరించనని అంది తమన్నా.విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే తను నా మనసుకు దగ్గరయ్యాడు అని చెప్పింది.