ఎంత కష్టపడ్డా.. హీరోలకే క్రెడిట్ ఇస్తరు.. బాహుబలిపై తమన్నా షాకింగ్ కామెంట్స్

Update: 2023-06-14 17:34 GMT

పాన్ ఇండియా సినిమాలో నటించాలని ఎవరికి ఉండదు..! ఎందుకంటే.. ఒక్క సినిమాతో దేశం మొత్తం ఫేమస్ అవ్వొచ్చు. రాజమౌళి బాహుబలి సినిమా విజయంతో ప్రభాస్, రానాలు పాన్ ఇండియా లెవల్ గా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క కీలక పాత్ర పోషించారు. అయితే, తాజాగా తమన్నా బాహుబలిపై షాకింగ్ కాంమెంట్స్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘బాహుబలి లాంటి సినిమాల్లో నటిస్తే కేవలం హీరోలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ లు ఎంత కష్టపడ్డా.. వాళ్లను కనీసం ఎవరూ పట్టించుకోరు. అందుకే బాహుబలిలో నటించిన రానా, ప్రభాస్ గ్లోబల్ లెవల్ లో పాపులర్ అయ్యారు. అనుష్క, రమ్యకృష్ణ, నా రోల్స్ గెస్ట్ గానే మిగిలిపోయాయి’ అని అసహనం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News