మహిళ చేతిపై తన టాటూ చూసి ఏడ్చేసిన తమన్నా

Update: 2023-06-27 06:17 GMT

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా. బాలీవుడ్‌ నటుడు విజయ​ వర్మతో ప్రేమయాణం నడుపుతున్న ఈ భామ ఇటీవల తరచూ వార్తల్లో నిలిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన నటించిన బోల్డ్ మూవీ లస్ట్ స్టోరీస్ జూన్ 29న విడుదల కానుంది. తాజాగా ముంబై విమానాశ్రయానికి వెళ్లిన తమన్నాకి ఓ మహిళా అభిమాని నుంచి అనుకోని అనుభవం ఎదురైంది. తన అభిమాన నటిని చూశానన్న ఆనందంలో ఆ .. తమన్నా పాదాలను తాకారు. అనంతరం ఒక బొకేతో పాటు లెటర్‌ను కూడా మిల్కీ బ్యూటీకి అందించారు.




 


అపై తన చేతిపై పచ్చబొట్టు కూడా చూపించడంతో తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. టాటూలో 'లవ్ యు ది తమన్నా' అనే అక్షరాలతో పాటు తమన్నా ఫోటోను అభిమానంతో వేపించుకున్నారు. అనంతరం ఆ అభిమానిని తమన్నా కౌగిలించుకుని చాలాసార్లు 'థాంక్య్' అని చెప్తూనే కారులోకి వెళ్లింది. అభిమానుల పట్ల తమన్నా చూపించే ప్రేమ ఎలా ఉంటుందో.. ఈ వీడియో చూస్తే చాలంటూ ఒక ఫ్యాన్‌ కామెంట్‌ చేశాడు. తను బంగారం లాంటి వ్యక్తి 13 ఏళ్లుగా తెలుసు.. అభిమానులను చాలా గౌరవంగా భావిస్తుంది అంటూ తమన్నాను పలు అభినందనీయమైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.




 






Tags:    

Similar News