Cricketers Biopic: క్రికెటర్ల బయోపిక్లో హీరోల ఎంపికపై.. నా చాయిస్ అదే: తమన్నా

By :  Bharath
Update: 2023-09-18 13:48 GMT

క్రికెట్ కు భారతీయులకు ప్రత్యేక అనుబంధం ఉంది. క్రికెట్ సీజన్ మొదలయిందంటే ఓ పండగ వాతావరణం మొదలవుతుంది. పనులన్నీ మానేసి టీవీలకు అతుక్కుపోతుంటారు. సొంత మైదానంలో మ్యాచ్ అంటే టికెట్ రేట్లు ఎంతున్నా.. మ్యాచ్ చూడ్డానికి వెళ్తుంటారు. అభిమాన ఆటగాడిని లైవ్ లో చూసి మురిసిపోతుంటారు. అయితే ఓ క్రికెటర్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. బయోపిక్ వల్ల ఆటగాడి కష్టం, ఎదిగిన తీరు ప్రజలకు తెలుస్తాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తుంది. మేటి ఆటగాళ్ల బయోపిక్ లు తెరకెక్కిస్తున్నారు కూడా.

ఇప్పటికే విరాట్ కోహ్లీ బయోపిక్ స్టోరీ స్క్రిప్ట్ రాయడం మొదలయిందని టాక్ వినిపిస్తుంది. తర్వాత వరుసలో చాలామంది క్రికెటర్ల బయోపిక్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని టాప్ హీరోయిన్ తమన్నాను అడిగితే ఆసక్తికర జవాబిచ్చింది. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్న క్రికెట్ పై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. అలాగే ఏ క్రికెటర్ బయోపిక్ ను ఏ హీరో తీస్తే బాగుంటుందని సజెస్ట్ చేసింది. ఈ లెక్కలో..* రోహిత్ శర్మ పాత్రను విజయ్ సేతుపతి

* హార్దిక్ పాండ్యా పాత్రను ధనుష్

* రవీంద్ర జడేజా పాత్రను అల్లు అర్జున్

* విరాట్ కోహ్లీ పాత్రను రామ్ చరణ్ తేజ్

Tags:    

Similar News