టాలీవుడ్ టాప్ హీరోలతో నటించిన సక్సెస్ కొట్టి, తర్వాత ఎంచక్కా పెళ్లి చేసుకుని సెటిలైపోయిన నమితకు కష్టాలొచ్చిపడ్డాయి. ఆమె భర్త వీరేంద్ర చౌదరి కోసం తమిళనాడు పోలీసులు వెతుకున్నారు. ఓ ఫ్రాడ్ కేసులో అతనికి నోటీసులు పంపారు. అయితే వీరేంద్ర ఆచూకీ తెలియడం లేదు. అరెస్ట్ భయంతో అతడు పరారైనట్లు భావిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం..
సేలం జిల్లాకు చెందిన గోపాలస్వామి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సూక్ష్మ, చిన్న- మధ్యతరహా పరిశ్రమల సంస్థ (MSME)కు చెందిన తమిళనాడు విభాగ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని తనకు కట్టబెట్టాలని రూ. 50 లక్షల లంచం ఇచ్చాడు. ఆ విభాగం మాజీ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లకు ఈ డబ్బులు అందించాడు. అయితే ఈ పదవిలో ఇటీవల వీరేంద్ర చౌదరి నియమితుడయ్యాడు. దీంతో తెరవెనక ఏం జరిగిందో తేల్చాలని గోపాలస్వామి సేలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలులు పోలీసులు గత నెలాఖర్లో వారిద్దరీని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం రాబట్టడానికి వీరంద్ర చౌదరికి కూడా నోటీసులు పంపారు. అయితే అతడు విచారణకు రాలేదు. దీంతో మళ్లీ నోటీసులు పంపారు. వీరేంద్ర ఇంట్లో లేకపోవడంతో పరారైనట్లు భావిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలిగిన నమిత 2017లో వీరేంద్రను పెళ్లి చేసుకుంది. ఆమెకు కవల పిల్లలు ఉన్నారు.