Tharun Bhascker: పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో.. సినిమాటిక్ యూనివర్స్
చిత్ర పరిశ్రమలో సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ నడుస్తుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్.. సినిమాటిక్ యూనివర్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తన తాజా చిత్రం కీడా కోలా ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లోని పాత్రలతో ఈ సినిమాటిక్ యూనివర్స్ నిర్మించబోతున్నాడట. ప్రెస్ మీట్ లో ‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో.. ఏ సినిమాకు సీక్వెల్ తీస్తార’ని అడగగా.. దానికి బదులిచ్చిన తరుణ్ భాస్కర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
‘ఈ సినిమాలకు సీక్వెల్ అని కాదు కానీ.. ఓ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నా. పెళ్లి చూపులు సినిమాలో విజయ్ పాత్రను, ఈ నగరానికి ఏమైందిలో కౌశిక్ పాత్రను తీసుకుని ఓ సీరియస్ కథ డెవలప్ చేయాలని ఉంది. ఈ రెండు పాత్రలతో థ్రిల్లర్ జోనర్ లో సినిమా తీస్తే బాగుంటుందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. కీడా కోలా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బ్రహ్మనందం, ‘30 వెడ్స్ 21’ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తో పాటు తరుణ్ భాస్కర్ కూడా నటించారు. కాగా ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.