Ganja Shankar Movie : 'గాంజా శంకర్‌' టీమ్‌కు టీఎస్ న్యాబ్ నోటీసులు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-18 04:48 GMT

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో 'గాంజా శంకర్' అనే సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణీ సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు సంపత్ నంది (Sampath Nandi) దర్శకుడు. నాలుగు నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజైంది. టీజర్ లో హీరో మత్తు పదార్థాలు, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు చూపించారు. సినిమా టైటిల్ లో కూడా గంజా అని ఉండడంతో.. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(TS NAB) తాజాగా చిత్రయూనిట్ కి నోటీసులు పంపింది.




 


సినిమా దర్శకుడు సంపత్ నంది, హీరో సాయి ధరమ్ తేజ్‌లతోపాటు మిగతా చిత్ర బృందానికి నోటీసులిచ్చింది. సినిమాలో గంజాయి వ్యాపారమే ముఖ్య నేపథ్యంగా సాగినట్లు టీజర్ ద్వారా తెలుస్తుందని, సినిమాలోని ముఖ్య పాత్ర ద్వారా గంజాయిని సేవిస్తున్నట్లు చూపించారని.. ఈ ప్రభావం యువత, విద్యార్థులపై పడుతుందని నోటీసుల్లో తెలిపింది. సినిమాలో మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండే సన్నివేశాలను తొలగించాలని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా టైటిల్ లో గాంజా అనే పేరును కచ్చితంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.




 




 



 





Tags:    

Similar News