వ్యూహం సినిమాపై స్టేకు హైకోర్టు నిరాకరణ

Byline :  Krishna
Update: 2023-12-26 07:00 GMT

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూవీపై మొదటి నుంచి టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు సెన్సార్ బోర్డు సైతం సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వర్మ పోరాడంతో ఎట్టకేలకు సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాపై నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను నిలిపేయాలని పిటిషన్లో కోరారు.

లోకేష్ దాఖు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 28న విచారించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఈ క్రమంలో విచారణను 28కి వాయిదా వేసింది. కాగా సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని.. ట్రైలర్లో చూపించిన విధంగానే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉందని పిటిషన్లో లోకేష్ ఆరోపించారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఎంతో నిబద్ధత, పారదర్శకతతో ఉన్నారని.. కానీ ఈ సినిమాతో ఆయన్ని అపఖ్యాతి చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు లబ్ది చేకూర్చేలా వర్మ వ్యవహరిస్తున్నారని అన్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటుందని వాపోయారు.

Tags:    

Similar News