Vyooham: 4 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి.. ‘వ్యూహం’ సినిమాపై తెలంగాణ హైకోర్టు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-05 10:58 GMT

వివాదాస్పద దర్శకుడిగా పేరున్న టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. గతంలో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్‌ని రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పుని ఇచ్చింది. అలాగే 4 వారాల్లో మళ్లీ సెన్సార్ బోర్డు రివ్యూ చేసి కొత్త రిపోర్ట్స్ ని సడ్మిట్ చేయాలని కోరింది. అయితే వర్మ టీం.. సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ని పరిశీలించిన న్యాయమూర్తి కూడా.. సింగిల్ బెంచ్ తీర్పుని అనుగుణంగా... సెన్సార్ బోర్డు ఈ నెల 9 లోపు రిపోర్ట్ ఇవ్వాలని తీర్పునిచ్చింది.

కాగా ఈ మూవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా సీన్స్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుందని, అందుకనే ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం సినిమాను తెరకెక్కించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తతం దానిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సెన్సారు బోర్డు అన్నింటిని పరిగణనలోకి తీసుకోలేనందున సినిమాను విడుదల చేయవద్దని టీడీపీ నాయకులు పిటిషన్‌లో కోరారు. అయితే సర్టిఫికెట్‌ జారీచేసే ముందు ప్రతి సినిమాకూ రివైజింగ్‌ కమిటీ కారణాలు పేర్కొనాల్సిన అవసరం లేదని ‘వ్యూహం’ నిర్మాతలు హైకోర్టులో వాదించారు.




Tags:    

Similar News