తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 హంగామా మొదలైంది. అనుమానాలకు తెరదించుతూ సీజన్‌పై ప్రోమో వీడియో వదిలారు. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ తర్వాత ఇంకో సీజన్ ఉంటుందో లేదోనన్న అనుమానాల మధ్య సీజన్ 7 ప్రోమో వచ్చేసింది. బిగ్‌బాస్‌తోపాటు ఏడంకెను తిరగేసి మరగేసి చూపించారు. ఎప్పట్లాగే సీనియర్ నటుడు అక్కినేని నాగార్జును వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ముందు అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 2 ఆదివారం నుంచి కొత్త సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా రెండు నెలల ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. సీజన్ 6 రేటింగ్ విషయంలో ఘోరంగా బోల్తాపడిన నేపథ్యంలో ఈసారి మరింత కసిగా పబ్లిసిటీ చేస్తున్నారు. మాంచి ఎంటర్‌టైనింగ్ పర్సనాలిటీలను వెతుకుతున్నారు.
గత కొన్ని సీజన్లు ఊరూపేరు లేనివారితో చాలా రొటీన్‌గా, జండుబామ్ షోలుగా మారడంతో నిర్వాహకులు ఈసారి మసాలా దట్టించే అవకాశాలు కనిపిస్తునాయి. గ్లామర్ బొమ్మల మంత్రం పనిచయకపోడంతో పక్కా మాస్, పక్కా కామెడీ పీసులను రంగంలోకి దించనున్నట్లు టాక్. కార్తీకదీపం శోభాశెట్టి, ఈటీవీ ప్రభాకర్, బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ మోహన భోగరాజు, ఢీ పండు, సిద్దార్ధ వర్మ, అమర్‌దీప్ చౌదరి వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో రచ్చ చేసేవాళ్లు కాకుండా జనానికి కాస్తా బాగా తెలిసిన వాళ్లను టీవీ, సినీనటులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే మళ్లీ నాగార్జునే హోస్టింగ్ చేయడంతో నీలినీడలు కమ్ముకున్నాయి. నాని, జూ. ఎన్టీఆర్ వంటి యంగ్ ఆర్టిస్టులైతే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.