హీరోయిన్ రష్మీక మందన్న కు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్...
ఏ టెక్నాలజీ అయినా మంచికి వినియోగించాలనే కనిపెడతారు. కానీ కొన్నిసార్లు అది దుర్వినియోగం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హవా సాగుతోంది. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు సెలబ్రిటీలే టార్గెట్ గా అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గా రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి చర్యలు దారుణం అంటూ ఖండిస్తున్నారు.
ఇక రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో వ్యవహారాన్ని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జే రాంబాబు సంబంధిత విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి అంజనీకుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ గారు వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి అప్పగించారు. ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టి కి తీసుకు రావాలని సూచించారు.