ఆగస్టులో విడుదలకానున్న చిత్రాలు ఇవే

Update: 2023-08-01 10:25 GMT

వేసవిలో బాక్సాఫీస్ వద్ద అలరించిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. దసరా, విరూపాక్ష, సామజవరగమన, బేబీ వంటి చిత్రాలు మినహా మరే సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో వానాకాలంలో ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు టాలీవుడ్‌ ఇండస్ట్రీ సిద్ధమైంది. ఆగస్టులో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కానున్నాయి. సీనియర్‌ స్టార్‌ హీరోలు నుంచి కుర్ర హీరోల వరకు అందరూ సినిమాలతో సిద్ధమైపోయారు. మరి ఆ సినిమాలేంటి? ఏ వారం విడుదల కాబోతున్నాయి చూసేద్దాం పదండి.

ఆగస్టు మొదటి వారంలో చిన్న సినిమాలే సందడి చేయనున్నాయి. వీటిలో రెండు డబ్బింగ్‌ సినిమాలు కావడం విశేషం. క్రికెటర్‌ ధోని ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఎల్‌జీఎం’ సినిమా విడుదల కాబోతోంది. ఇక కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించిన ‘హెబ్బులి’ ఆగస్టు 4న రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు, ‘రాజుగారి కోడిపులావ్‌’, విజయ్‌ ఆంటోనీ, సోనూసూద్‌ స్పెషల్ రోల్ పోషించిన ‘విక్రమ్‌ రాథోడ్‌’, ‘మిస్టేక్‌’, ‘దిల్‌ సే’, ‘మెగ్‌2’ వంటి సినిమాలు విడుదల కానున్నాయి.

‘పెద్దన్న’సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న తమిళ స్టార్ హీరో రజనీకాంత్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ డైరెక్షన్‎లో ‘జైలర్‌’ చిత్రంలో నటించారు. ఈ మూవీ ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన 'కావాలయ్యా' పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక ఈ నెలలో మెగా హీరోలు సందడి చేసేందుకు రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కీలక పాత్రను పోషిస్తోంది. శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌’ కూడా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ మూవీలో బలగం ఫేమ్ కావ్యా కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‎గా నటిస్తోంది.

ఆగస్టు 18న నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వైష్ణవ్‌తేజ్‌ నటించిన ‘ఆదికేశవ’, శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్‎ వహించిన ‘పెదకాపు 1’, సొహైల్‌ కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’, ‘నచ్చినవాడు’ రిలీజ్‎కు రెడీగా ఉన్నాయి. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘గాంఢీవధారి అర్జున’ మూవీ కూడా ఆగస్టులోనే విడుదల కానుంది. యాక్షన్‌, స్పై ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రం వెండితెరమీద సందడి చేయనుంది. కార్తికేయ హీరోగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’ ఆగస్టు 25న రిలీజ్ కానుంది.

మరోవైపు బాలీవుడ్ నుంచి రెండు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. 2012లో రిలీజ్ అయిన ‘ఓ మై గాడ్‌’ చిత్రానికి సీక్వెల్‎గా ‘ఓ మై గాడ్‌2’ వస్తోంది. అక్షయ్‌కుమార్‌ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీని అమిత్‌రాయ్‌ డైరెక్ట్ చేశారు. ఆగస్టు 11న వెండితెరమీద సందడి చేయనుంది. మరో వైపు సన్నీడియోల్ నటించిన ‘గదర్‌ 2’ కూడా ఆగస్టు 11న విడుదలవుతోంది. ఇవి రెండు చిత్రాలు సీక్వెల్స్‌ కావడం విశేషం. ఈ చిత్రాలపైన భారీ అంచనాలే ఉన్నాయి. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించిన మరో సీక్వెల్ ‘డ్రీమ్‌గర్ల్‌ 2' సినిమా ఆగస్టు 25న విడుదల అవుతోంది.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు :

సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి హీరోగా నటించిన ‘దయా’ చిత్రం ఆగస్టు 4న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక యువ కథానాయిక శోభిత ధూళిపాళ్ల, అర్జున్‌ మాథుర్‌ కీ రోల్స్‎లో నటించిన ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌‎లో ఆగస్టు 10న స్ట్రీమ్ చేయనున్నారు. పెళ్లి తరువాత ఫుల్ జోష్‎లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఓటీటీలోనూ అలరించబోతోంది. గాల్‌ గాడోట్‌, అలియాభట్‌ ప్రధానపాత్రల్లో నటించిన హాలీవుడ్‌ మూవీ ‘హార్ట్‌ ఆఫ్‌ ది స్టోన్‌’ భారతీయ భాషల్లో ఆగస్టు 11న నెట్‌ఫ్లిక్స్‎లో స్ట్రీమ్ కానుంది. విపుల్‌ అమృతలాల్‌ దర్శకత్వం వహించిన ‘కమాండో’ ఆగస్టు 11న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. రాజ్‌ అండ్‌ డీకే ద్వయం డైరెక్షన్‎లోవస్తున్న మరో ఆసక్తికర క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ ఆగస్టున నెట్‎ఫ్లిక్స్‎లో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‎లో మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌, బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలు కనిపించనున్నారు.




Tags:    

Similar News