థియేటర్‌లో రచ్చ.. హనుమంతుడి సీట్‌లో కూర్చున్నాడని కొట్టారు

Update: 2023-06-16 03:21 GMT

జై శ్రీరామ్ నినాదాల మధ్య తెలుగురాష్ట్రాల్లోని థియేటర్‌లలో 'ఆదిపురుష్' రచ్చ లేపుతోంది. ప్రభాస్ రాఘవుడిగా కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమా.. శుక్రవారం గ్రాండ్​గా రిలీజైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థియేటర్ లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాముడు గురించి వినిపించిన ప్రతిచోట హనుమంతుడు తప్పకుండా ఉంటాడని నమ్మమని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రతీ థియేటర్ లో ఓ సీటును హనుమంతుడి కోసం కేటాయించారు కూడా. కొన్ని చోట్ల ఆ సీట్ లో



హనుమంతుని ఫోటో పెట్టి పూజలు చేస్తున్నారు. ఆ సీటును ఖాళీగా వదిలేయకుండా ఆంజనేయుడి చిత్రపటాన్ని లేదంటే.. కాషాయ వస్త్రాన్ని ఉంచి పూలు సమర్పిస్తున్నారు.

అయితే హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్‌లో మాత్రం ఈ సీటు విషయంలో పెద్ద గొడవే జరిగింది. ఈ తెల్లవారుజామున ఆదిపురుష్ షో చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. హనుమంతుడికి కేటాయించిన సీటులో కూర్చున్నాడు. దీంతో ఆగ్రహించిన కొందరు ప్రేక్షకులు.. అతనిపై దాడి చేశారు. థియేటర్ సిబ్బంది వచ్చి గొడవ సద్దుమణిగేలా చూసి.. ఆ వ్యక్తిని మరో చోట కూర్చోబెట్టారు. సీటులో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు ఫ్యాన్స్ తెలిపారు. అయితే ఈ విషయంలో నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. థియేటర్‌లో దేవుడు వచ్చి కూర్చుంటాడని నమ్మేవారు.. సాటిమనిషిలో మాత్రం ఎందుకు చూడలేకపోతున్నారని విమర్శిస్తున్నారు 




 


Tags:    

Similar News