Rashmika Mandanna : రష్మిక డీప్ఫేక్ వీడియో.. కేంద్రం సీరియస్ వార్నింగ్
టాలీవుడ్ నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ఫేక్ వీడియో ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్ఫింగ్ వీడియోలు అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించిన కేంద్రం.. వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియాలదేనని స్పష్టంచేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మంగళవారం అడ్వైజరీ జారీచేసింది. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించబడుతుంది’ అని పేర్కొంది.
అలాగే, కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, గత ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు చట్ట పరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని, వినియోగదారులు నకిలీ/తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయకుండా చూసుకోవాలని తెలిపారు. ఒకవేళ తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినా, దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని సూచించారు. నింబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
కాగా, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి నటి రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లోకి వచ్చినట్లు మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో రష్మికకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. దీనిపై లీగల్ కేసు నమోదు చేయాలని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగాన్ని చూస్తుంటే భవిష్యత్తుపై భయం వేస్తోందని సినీ నటుడు నాగచైతన్య ఈ అంశపై స్పందించాడు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రష్మిక మందన్నా కృతజ్ఞతలు తెలిపింది.
Government probing , actor Rashmika Mandanna, deepfake video, cheating by impersonation , computer resources , imprisonment , three years , Rs 1 lakh fine,