ఉపాధి కోసం వెళ్లి ఎడారిలో బానిసగా మారిన బతుకు..'ది గోట్ లైఫ్' రివ్యూ

Byline :  Shabarish
Update: 2024-03-28 11:06 GMT

కొన్ని కథలు చూసిన దగ్గర్నుంచీ వెంటాడతాయి. ఆ కథల్లోని పెయిన్ మనల్ని డిస్ట్రబ్ చేస్తుంది. మళయాల స్టార్ పృథ్వీరాజ్ నటించిన ద గోట్ లైఫ్‌.. ఆడు జీవితం అనే సినిమా కూడా అంతే. 1990స్ తో కేరళ నుంచి అరబ్ కంట్రీస్ కు వెళ్లి మోసపోయి ఒక ఎడారిలో గొర్రెలు మేపాల్సి వచ్చిన నజీబ్ మహ్మద్ అనే వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. ద గోట్ లైఫ్ ఆడు జీవితం అనే పేరుతో అక్కడ అతని కథ నవలగా వస్తే.. హయ్యొస్ట్ పబ్లికేషన్స్ అయింది. కేరళలో మత గ్రంథాలతో పాటు ఈ నవల కూడా ప్రతి ఇంటిలో ఉంటుందంటారు. అలాంటి వ్యక్తి కథలో పృథ్వీరాజ్ లాంటి స్టార్ యాక్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. అందుకే దర్శకుడు బ్లెస్సీ 2008లోనే ఈ నవల రైట్స్ తీసుకున్నప్పుడు పృథ్వీరాజ్ నే హీరోగా అనుకున్నాడు. అప్పటి నుంచి ట్రావెల్ అయిన ఈ కథ ఇప్పటికి ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఈ మినీ రివ్యూలో చూద్దాం.

కేరళలో ఓ చిన్న గ్రామానికి చెందిన నజీబ్.. రోజంతా నదిలోని నీళ్ల నుంచి ఇసుకని తీసి అమ్ముకునే పని చేస్తుంటాడు. తనకి భార్య ఉంటుంది. ఓ ఫ్రెండ్ ద్వారా అరబ్ కంట్రీకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అదే ఊరికి చెందిన వ్యక్తి ఓ కంపెనీలో పని ఉందని, ఏసి రూమ్, ఫ్రీ ఫుడ్ అని చెప్పి డబ్బులు తీసుకుని దుబాయ్ పంపిస్తాడు. అతనితో పాటు పక్క ఊరి కుర్రాడు కూడా వెళతాడు. తీరా అక్కడికి వెళితే ఓ అరబ్ షేక్ వచ్చి వీరిని తీసుకుని ఎడారిలో గొర్రెలు మేపేందుకు నియమిస్తాడు. అక్కడ వేరే మనిషి ఉండడు. తిండీ నీళ్లూ సరిపడినంతా ఉండవు. తాము మోసపోయాని మూడేళ్ల తర్వాత తెలుసుకున్న ఈ ఇద్దరూ ఆ ఎడారి నుంచి తప్పించుకోవాలనుకుంటారు. వీరికి మరో వ్యక్తి సాయం చేస్తాడు. ముగ్గురూ కలిసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఈ ప్రయత్నంలో వాళ్లు సక్సెస్ అయ్యారా లేదా అనేది మిగతా కథ.

నవలను సినిమాగా మలుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. కానీ దర్శకుడు బ్లెస్సీ ప్రతి అక్షరాన్ని చూపించాలనుకున్నాడు. దీనివల్ల సినిమా నిడివి మూడు గంటలు అయ్యింది. ఎక్కువ ఆర్టిస్టులు కనిపించని సినిమా కావడం వల్ల మూడు గంటలు అనేది చాలా పెద్ద మైనస్ అయింది. పైగా ఎంత పక్కవారి వేదన అయినా అచ్చంగా చూపిస్తే అవతలి వారికి బాధకు బదులు కొన్నిసార్లు చిరాకు, నిట్టూర్పూ వస్తాయి. అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయీ సినిమాలో. నిజమే ఒక వ్యక్తి ఎన్నో బాధలు పడ్డాడు అనుకున్నా.. అవన్నీ అచ్చంగా చూపించాల్సిన పనిలేదు. ఎడారిలో నడుస్తున్నప్పుడు ఆ నడకంతా చూపడం, గొర్రెలు మేపే క్రమంలో పడే బాధలు ఒకటికి నాలుగు సార్లు చూపడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

బట్.. ఓ మంచి జీవితం కోసం పరాయి దేశం వెళ్లి ఎన్నో బాధలు పడే ఎంతోమంది జీవితాల్ని కళ్ల ముందు చూపుతుందీ సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తే పెద్దగా చదువు లేకుండా, పరాయి దేశం వెళ్లాలనుకునేవాళ్లు.. ముఖ్యంగా అరబ్ కంట్రీస్ కు వెళ్లాలనుకునేవాళ్లు భయపడిపోయేలా ఉంది. పృథ్వీరాజ్ ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు. పాత్ర కోసం 30 కిలోలకు పైగా బరువు తగ్గడం అంటే మాటలు కాదు. నటుడుగా అతనికి లైఫ్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. దర్శకుడు బ్లెస్సీ ప్రతి విషయాన్నీ డీటెయిల్డ్ గా చెప్పడం ఎంత బావుందో.. అంత లెంగ్తీగానూ అనిపిస్తుంది. ఓవరాల్ గా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ ను మాత్రమే ఇష్టపడేవారు ఈ సినిమాను చూడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News