మెగా స్టార్ చిరంజీవి రీసెంట్ సినిమా భోళా శంకర్.. థియేటర్స్ లో పెద్దగా ఆడలేదన్న విషయం తెలిసిందే. దాంతో తర్వాత వచ్చే సినిమాపై మెగా స్టార్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈసారి ఇండస్ట్రీని ఏలేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా విశ్వంభర. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెత్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మెగా స్టార్ కచ్చితంగా హిట్ కొడతాడని అభిమానలు ఆశిస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా.. క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
ఫిబ్రవరి 2 నుంచి ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడుతుంది. యాక్షన్ పార్ట్స్ లో కూడా ఇటీవల పాల్గొన్నారు. అదే విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కు వెన్ మిత్స్ కొల్లాయిడ్.. లెజెండ్స్ రైజ్.. అనే క్యాప్షన్ ఇచ్చారు. యాడో ఇమేజ్ లో ఉన్న మెగా స్టార్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ పోస్టర్ క్షణాల్లో వైరల్ కాగా.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కాగా ఈ పోస్టర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. జనవరి 15, 2025న సంక్రాంతి కానుకగా విశ్వంభర సినిమా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో మెగా స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. చిరు సరసన మృణాల్ ఠాకూర్, అనుష్క, హనీ రోజ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అస్కార్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.