OTT: ఈ వారం థియేటర్/ OTT లో విడుదలయ్యే సినిమాలివే

Update: 2023-10-02 06:19 GMT

పెద్ద హీరోల, హై బడ్జెట్ సినిమాలన్నీ దసరా పండుగ వేళ సందడి చేయనున్న నేపథ్యంలో.. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలన్నీ రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్‌ వద్ద పోటీ ఉండవని భావించి.. ఈ వీకెండ్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు ఆయా మూవీ మేకర్స్. మరి ఈ వారం థియేటర్‌లో అలాగే ఓటీటీలో రాబోయే చిత్రాలంటో ఓసారి చూద్దాం.

ఈ నెల మొదటివారంలో.. 6వ తేదీన విడుదలకు సిద్ధంగా 6 సినిమాలు ఉన్నాయి. రూల్స్ రంజన్, మ్యాడ్, మామా మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. వీటి ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. వీటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న మూవీస్ మామా మశ్చీంద్ర, రూల్స్ రంజన్.

సుధీర్‌బాబు కెరీర్ లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా మామా మశ్చీంద్ర, నటుడు-దర్శకుడు హర్షవర్థన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఈషారెబ్బా, మిర్నాలినీ రవి హీరోయిన్లుగా నటించారు. తెలుగు, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.


ఇక అదే రోజున.. కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ విడుదల కానుంది. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్.. యూత్‌ను విపరీతంగా ఎట్రాక్ట్ చేశాయి.



ఇక భారీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ నిర్మించిన మరో యూత్ ఫుల్ మూవీ ‘మ్యాడ్‌’ కూడా ఈ శుక్రవారమే థియేటర్‌లలో విడుదల కానుంది.నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇంజినీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో ఉంటుంది. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ కూడా అక్టోబరు 6న విడుదల కానుంది. శ్రీలంక జట్టు మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘800', సిద్ధార్థ్‌ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘చిత్త’ డబ్బింగ్ మూవీ ఓటీటీల విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్‌ లో అక్టోబర్ 5 న మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి, ఆ తర్వాతి రోజు అక్టోబరు 6 న ఆహా లో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాలు అలరించనున్నాయి. ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ కూడా అక్టోబరు 6నే ఆహాలో విడుదల కానుంది.



Tags:    

Similar News