Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు కశ్మీర్ ఫైల్స్ ను నమ్ముకున్నాడా..?

By :  Babu Rao
Update: 2023-10-10 13:22 GMT

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఇంతకు ముందు దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి ఫ్లాప్ చిత్రాలు రూపొందించిన వంశీ టైగర్ నాగేశ్వరరావుకు దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించన ఈ మూవీ ఈ నెల 20న విడుదల కాబోతోంది. రవితేజతో సరసన ఫీమేల్ లీడ్స్ లో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, నాజర్ కీలక పాత్రల్లో కనిపించబోతోన్న ఈ మూవీ ప్రధాన ధైర్యం కశ్మీర్ ఫైల్స్ అని చెబుతున్నారు.అఫ్ కోర్స్ తెలుగులో కాదు.

టైగర్ నాగేశ్వరరావును భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద దొంగగా చెబుతున్నారు వీళ్లు. ఆ ట్యాగ్ తోనే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేస్తున్నారు. ఇతర భాషల్లో రవితేజకు పెద్దగా మార్కెట్ లేదు అనేది అందరికీ తెలుసు.నార్త్ లో మాత్రం డబ్బింగ్ మార్కెట్ తో కొంత వరకూ తెలుసు. అయితే ఈ టైగర్ ని మాస్ రాజా సినిమాగా కాకుండా కశ్మీర్ ఫైల్స్ నిర్మాత తీసిన సినిమాగానే నార్త్ బెల్ట్ లో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ వంటి బిలో యావరేజ్ కంటెంట్ తో 300 కోట్లు కొల్లగొట్టాడు అభిషేక్ అగర్వాల్. పైగా ఈ మూవీ తర్వాత చేసిన కార్తికేయ2 తో ఓవర్ నైట్ అతనో వీర దేశభక్తుడుగా అవతరించాడు. విశేషం ఏంటంటే.. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2కు వివేక్ కూచిభొట్ల మరో నిర్మాతగా ఉన్నా.. క్రెడిట్ అంతా అభిషేక్ కే వెళ్లింది. బిజెపి వాళ్లైతే అభిషేక్ ను కశ్మీర్ ఫైల్స్ నిర్మాతగానే ఎక్కువగా మోశారు. ఆ మోత టైగర్ నాగేశ్వరరావుకూ పనిచేస్తుందనే.. స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు లైఫ్ లోని ఇందిరా గాంధీ ఎపిసోడ్ ను ఈ మూవీలో ఇరికించారు అని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది.

మొత్తంగా నార్త్ లో టైగర్ ను కశ్మీర్ ఫైల్స్ నిర్మాత తీసిన సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా ఉంది కాబట్టి.. కశ్మీర్ ఫైల్స్ నచ్చిన వాళ్లంతా మరోసారి ఈ మూవీ కోసం ఎగబడతారు అనేది నిర్మాత ఎత్తుగడ కావొచ్చేమో కానీ.. కొన్ని విషయాలు అన్నిసార్లూ వర్కవుట్ కావు. మరి ఇదే కాకుండా టైగర్ లో బలమైన కంటెంట్ ఉంటే ఆకట్టుకోవచ్చేమో కానీ..ముందు కశ్మీర్ ఫైల్స్ అనే ట్యాగ్ ద్వారానే ఈ మూవీ ఇతర భాషల్లో ప్రమోట్ అవుతోంది.

Tags:    

Similar News