టీజర్ అదిరింది భయ్యా..ఊర మాస్ లుక్‌లో టైగర్ నాగేశ్వర రావు..
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వర రావు టీజర్ వచ్చేసింది. టైగర్ దండయాత్ర అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ టీజర్ ఓ రేంజ్లో దుమ్ముదులుపుతోంది. ఈ టీజర్ చూస్తే నిజంగానే రవితేజ భయంకరమైన దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. మాస్ మహారాజ లుక్స్ చూస్తే అరుపులే. ఈ టీజర్‌తో మూవీ విడుదలకు సంబంధించిన క్లారిటీని కూడా మేకర్స్ ఇచ్చేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
టీజర్ మొదలుకాగానే..కొన్నిఫేమస్ సిటీల్లో దోపీడీలకు పాల్పడిన స్టువర్ట్ పురం దొంగ సెంట్రల్ జైలు నుంచి పారిపోయినట్లు చూపించారు మేకర్స్. వాస్తవిక కథ ఆధారంగా టైగర్ నాగేశ్వర రావు సినిమా వస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ ఆఫీసర్‌గా అనుపమ ఖేర్ కనిపించనున్నారు. ఏపీ మ్యాప్‌ను చూపిస్తూ..గుంటూరు,తెనాలి,బాపట్ల ప్రాంతాలను చూపిస్తూ.. ఈ జోన్ అంతా టైగర్ నాగేశ్వరరావుది అంటూ రవితేజ ఇచ్చిన ఇంట్రో అదుర్స్. తనదైన స్టైల్లో డైలాగ్ డెలివరీ చేసి ఫ్యాన్స్‌ను అలరించాడు మాస్ మహారాజ.
టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ యాక్షన్ ఆయన ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు..అంటూ యాక్టర్ మురళీశర్మ చెప్పే డైలాగ్ రవితేజ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తోంది. ఈ మూవీలో మాస్ రాజా రోల్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందో టీజర్లో చెప్పేశారు మేకర్స్ .
అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవడ్ బ్యూటీ నుపుర్ సనన్ రవితేజతో జోడీ కట్టింది. అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్ వంటి వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు వెండితెర మీద సందడి చేయనుంది.