జంబల్ హాట్ లేడీని పట్టిన సిద్ధూ..టిల్లుగాడి టైమింగ్ వేరే లెవల్

Byline :  Shabarish
Update: 2024-03-28 07:25 GMT

డీజే టిల్లుతో ఆడియన్స్‌ను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ మూవీతో వస్తున్నాడు. డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సిద్దుతో, అనుపమ హాట్ హాట్‌గా కనిపిస్తూ ఈ మూవీపై మరించి హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో రొమాంటిక్ డోస్, టిల్లుగాడి డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

ట్రైలర్‌లో అనుపమ చేతిలో టిల్లు బలైపోయినట్లు చూపించారు. ప్రతిసారీ ఎక్కడ పడతావ్ రా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్‌ని..అని ప్రిన్స్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. ఈసారి ఒకటికి రెండుసార్లు కడుపుబ్బా నవ్వుకునేలా మూవీ ఉంటుందని ట్రైలర్ చెప్పేసింది. సిద్దు స్టైల్, డైలాగ్ డెలివరీ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నాయి. సితార ఎంటర్టైన్‌మెటంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ మూవీని నిర్మించాయి.

ఈ మూవీకి రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందించారు. సమ్మర్‌లో టిల్లుగాడు మంచి టైమింగ్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేయడానికి వచ్చేస్తోంది. 

Full View

Tags:    

Similar News