కృతి సనన్, ప్రభాస్ సీతారాములుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ చిత్రం వివాదాలు ఆగడం లేదు. రామాయణం కథను భ్రష్టుపట్టించారని విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పొరపాటైందని మూవీ టీమ్ సర్ది చెప్పినా కొందు వినడం లేదు. ఆ మూవీని నిషేధించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆ సినిమా రామాయణానికి మక్కికి మక్కీ తీసిన చిత్రం కాదు కదా. దేశం అసహనం మరీ పెరిగిపోయింది. ఇలాంటి విషయాలు కోర్టుల వ్యవహారం కాదు. ప్రతి ఒక్కరూ ప్రతిదానికీ ఎందుకంతగా బాధపడిపోతున్నారు? పుస్తకాలు, సినిమాలపై రోజురోజుకూ ఇంత అసహనం పెరుగుతోంది ఎందుకు?’’ అని జస్టిస్ ఎస్కే కౌల్, ఎస్కే సుధాంశు ధూలియాల ధర్మాసనం ఆక్షేపించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అన్ని అంశాలు పరిశీలించే సర్టిఫికెట్ ఇచ్చిందని, తాము గొడవలో తలదూర్చలేమని స్పష్టం చేసింది. ఆదిపురుష్ హిందువులు మనోభావాలు దెబ్బతీసిందంటూ మమతారాణి అనే న్యాయవది ఈ పిటిషన్ వేశారు.
Tolerance growing down on movies and books Supreme court say on Adipurush ban case