ప్రముఖ టాలీవుడ్ నటుడు కన్నుమూత.. అమెరికా నుంచి ఆలస్యంగా

By :  Krishna
Update: 2023-11-03 11:02 GMT

ప్రముఖ తెలుగు సినీ నటుడు ఈశ్వరరావు ఇక లేరు. ‘స్వర్గం నరకం’, ‘ప్రేమాభిషేకం’, ‘దయామయుడు’, ‘ఘరానా మొగుడు’ తదితర చిత్రాల్లో నటించిన ఆయన అమెరికాలో అనామకంగా కన్నుమూశారు. ఈశ్వరరావు అక్టోబర్ 31న తమ ఇంట్లోనే చనిపోయారని అమెరికాలోని మిషిగన్‌లో ఉంటున్న ఆయన కూతురు లావణ్య తెలిపారు. రెండు తరాల ప్రేక్షకులను అలరించిన ఈశ్వరరావు మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ, టీవీ ప్రేక్షకులు ఆయన నివాళి అర్పిస్తున్నారు.

200లకు పైగా చిత్రాల్లో నటించిన ఈశ్వరరావు తన తొలి సినిమా ‘స్వర్గం నరకం’(1975) చిత్రానికే సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే మోహన్ బాబు కూడా తెరంగేట్రం చేశారు. దేవతలారా దీవించండి , కన్నవారిల్లు, ఖైదీ నెం: 77 . యుగపురుషుడు, శభాష్ గోపి, ఆడదంటే అలుసా. తల్లిదీవెన , మంచిని పెంచాలి , ప్రేమాభిషేకం , బంగారుబాట, మినిస్టర్ మహాలక్ష్మి, సంగీత, ఈ కాలం కథ, పున్నమి చంద్రుడు. ప్రెసిడెంట్ గారి అబ్బాయి , ఘరానా మొగుడు తదతర చిత్రాల్లో నటించారు. సినీ అవకాశాలు తగ్గాక టీవీ సీరియళ్లలోనూ కనిపించారు.


Tags:    

Similar News