వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి ఫిక్స్ .. రేపోమాపో నిశ్చితార్థం!
ఫ్యామిలీ ఎంటర్లైన్‌మెంట్ హీరో వెంకటేశ్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగానున్నాయి. ఆయన రెండో కూతురు హయవాహినికి పెళ్లి కుదిరింది. విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. రేపోమాపో నిశ్చితార్థం జరుగుతుందని, దుగ్గుబాటి కుటుంబ సభ్యులు ఇప్పటికే విజయవాడకు వెళ్లారని సినీ వర్గాలు చెబుతున్నాయి. హయవాహిని అథ్లెట్ అని, ఫ్యాషన్ రంగంలోనూ సత్తా చాటుతోందని వార్తలు వస్తున్నాయి.
వెంకటేశ్ తన వ్యక్తిగత విషయాలను బయటికి చెప్పడు కాబట్టి ఆయన పిల్లల వివరాలు పెద్దగా తెలియవు. పెద్ద కూతురు ఆశ్రిత మాత్రం ఫుడ్ బ్లాగర్. ఆమెకు 2019లో వరంగల్ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త ఆర్ సురేందర్‌రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో పెళ్లయింది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్నకూతురి పేరు భావన కాగా, కొడుకు పేరు అర్జున్ రామంత్. వెంకటేశ్ తాజా చిత్రం ‘సైంధవ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద కానుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రనంలో రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదతరులు నటిస్తున్నారు.