తన అందంతో, నటనతో తెలుగు రాష్ట్రాలను ఒకప్పుడు ఓ ఊపుఊపేసింది టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. సెకండ్ ఇన్నింగ్స్‌లో బాహుబలి వంటి భారీ ప్రాజెక్ట్‌లో నటించి తన పెర్ఫార్మెన్స్తో ఇరగదీసింది. ఈ సినిమాలో శివగామి పాత్రకు రమ్యకృష్ణ మాత్రమే న్యాయం చేయగలదు అని అనిపించేంతలా ఆ పాత్రకు ప్రాణం పోసింది. ఆ సినిమా తరువాత రమ్య శైలజారెడ్డి అల్లుడు, రిపబ్లిక్, రొమాంటిక్, లైగర్, రంగ మార్తాండ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయగల సత్తా రమ్యకృష్ణది. అందుకే ఆమెకు ఎక్కువ శాతం పవర్ఫుల్ ఆఫర్లు వస్తుంటాయి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా రమ్య సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చూస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు. తాజాగా రమ్య కృష్ణ రెడ్ కలర్ శారీ కట్టుకుని నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునేలా క్రేజీ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
శివగామిగా రాజ్యాన్ని పాలించాలన్నా.. దేవతగా అవతారం ఎత్తాలన్నా.. గ్లామర్ లుక్‌లో కనిపించాలన్నా ఒక్క రమ్యకృష్ణకే చెల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1992 నుంచి 2000 వరకు స్టార్ హీరోయిన్గా తన ప్రతిభతో ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ తన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగానే పాత్రలు వస్తుండటంతో రమ్యకృష్ణ ఇప్పుడు కూడా ఇండస్ట్రీని తన పెర్ఫార్మెన్స్ తో రాక్ చేస్తున్నారు. తాజాగా రమ్యకృష్ణ చీరకట్టులో కనిపించి కుర్ర హీరోయిన్స్ సైతం కుళ్లు కునేలా చేస్తున్నారు. లేటు వయసులోనూ ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తూ అందరి దృష్టి ఆమెపై పడేలా చేస్తున్నారు.
కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ. ఆయన డైరెక్షన్లో సూపర్‌హిట్ సినిమాలు చేశారు రమ్య. 90లలో కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్ రమ్యకృష్ణ. తన హాట్ అందాలతో, నటనా నైపుణ్యంతో తెలుగువారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. పెళ్లైన తరువాత తల్లి, వదిన వంటి పలు పాత్రల్లో నటించినా అవి కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
నవ రసాలను ఈజీగా పండించగల నటి రమ్యకృష్ణ . ఇలాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. 1985లో ‘భలే మిత్రులు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రమ్యకృష్ణ.
1990 నుంచి 2000..వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేశారు.