Soumya Shetty : దోపిడీ కేసులో తెలుగు నటి అరెస్ట్..

Byline :  Veerendra Prasad
Update: 2024-03-03 12:07 GMT

నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాల్సిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ చేతివాటం ప్రదర్శించి జైలు పాలయ్యింది. ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి.. దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఈ కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విశాఖ పట్నం పెందుర్తిలో ఈ ఘటన జరిగింది.




 


వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంకు చెందిన సౌమ్య అనే నటి గతంలో ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం మరో తెలుగు మూవీ కూడా చేస్తోంది. విశాఖ పట్నంలోని రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి జనపలా ప్రసాద్ కుమార్తె, మరో ఇన్‌స్టా ఇన్ఫ్‌ఫ్లుయన్సర్ అయిన మౌనికకు ఈమే స్నేహితురాలు. మౌనికతో స్నేహం చేస్తున్న క్రమంలో తరచూ ఆమె ఇంటికి రాకపోకలు సాగించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సౌమ్య.. ప్రసాద్ ఇంటికి వెళ్ళింది. ఇక అలా వెళ్లి ఇంట్లో ఎవరికి తెలియకుండా కిలో బంగారంను దొంగతనం చేసి.. గోవాకు చెక్కేసింది.




 


ఇక ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో ప్రసాద్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా సౌమ్యపై అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసులు ఆమెపై నిఘా వేశారు. ఇక అందిన బంగారంతో సౌమ్య.. గోవాలో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఎట్టకేలకు సౌమ్య ఆచూకీ తెలుసుకున్న పోలీసులు.. గోవా పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ ఆమెను అరెస్ట్ చేసి వైజాగ్ కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఆమె నుండి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ‘మిగిలిన బంగారాన్ని నేను తిరిగి ఇవ్వలేను. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటా’ అంటూ బెదిరించిందని తెలుస్తోంది. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 15 రోజుల రిమాండ్ తరలించారు. చేతిలో డబ్బులు లేక, అవకాశాలు రాక.. ఆమె ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని సమాచారం.




 




 




 




 



Tags:    

Similar News