కేసీఆర్‌కు బ్రహ్మానందం గిఫ్ట్.. సకుటుంబ సమేతంగా రారండి..

Update: 2023-07-29 14:36 GMT

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన రెండో కొడుకు సిద్ధార్ధ్ పెళ్లికి రావాలని సీఎం దంపతులను ఆహ్వానించారు. కొడుకు రాజా గౌతమ్, భార్యతో కలసి శనివారం ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లారు. శుభలేఖ ఇచ్చికాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తను పెన్సిల్‌తో గీసిన తిరుమల వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి కానుకగా ఇచ్చారు. బ్రహ్మానందం సినిమాల మధ్య ఖాళీ సమయంలో పెన్సిల్‌తో బొమ్మలు వేసి ప్రముఖులకు గిఫ్టుగా ఇస్తుంటారు.

ఆయన కొడుకు సిద్ధార్థ్ నిశ్చితార్థం 21న ఐశ్వర్య అనే యువతితో జరిగింది. పెళ్లి ఎప్పుడో తెలియడం లేదు. గౌతమ్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. సినిమాలు ఆడకపోవడంతో ప్రస్తుతం పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఇద్దరు పిల్లలు. సిద్ధార్థ్‌ తొలి నుంచి సినీ పరిశ్రమకు దూరంగానే ఉంటున్నారు. విదేశాల్లో చదువుకున్న అతడు అక్కడే సెటిల్ అయినట్లు తుస్తోంది. ఆయన కాబోయే భార్య కరీంనగర్‌లోని గైనకాలజిస్ట్‌ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం యజమాని డాక్టర్‌ పద్మజా వినయ్‌ కూతురు. ఆమె కూడా డాక్టరే.


Tags:    

Similar News