Ram Pothineni : కోహ్లీ బయోపిక్పై రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Byline :  Krishna
Update: 2023-09-24 05:13 GMT

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఎన్నో బయోపిక్లు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. సచిన్, ధోనీ వంటి క్రికెటర్ల బయోపిక్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ బయోపిక్ అంశం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బయోపిక్ తీయాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు.




 


విరాట్ బయోపిక్లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు నెట్టింట వైరల్గా మారాయి. రాంచరణ్ కోహ్లీ బమోపిక్లో నటిస్తారని ప్రచారం జరిగింది. చరణ్ అయితే విరాట్ రోల్కు పర్ఫెక్ట్గా సరిపోతాడని బాలీవుడ్ మేకర్స్ అనుకున్నారట. ఒకవేళ ఛాన్స్ వస్తే విరాట్ బయోపిక్కు సిద్ధమే అని గతంలో చెర్రీ కూడా చెప్పాడు. ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ బయోపిక్ చేస్తానంటున్నాడు.




 


రామ్ పోతినేని నటించిన స్కంద మూవీ ఈ నెల 28 రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వూలో రామ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. విరాట్ బయోపిక్లో ఛాన్స్ వస్తే నటిస్తానని అన్నాడు. కోహ్లీకి తనకు దగ్గరి పోలికలు ఉన్నాయని.. ఇది సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పాడు. దీంతో మరోసారి విరాట్ బయోపిక్ హాట్ టాపిక్గా మారింది.




 


Tags:    

Similar News