Hero Venu : టాలీవుడ్ హీరో వేణు తండ్రి కన్నుమూత

Update: 2024-01-29 06:46 GMT

టాలీవుడ్ హీరో వేణు కుటుంబంలో విషాదం నెలకొంది. వేణు తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు కన్నుమూశారు. 92 ఏళ్ల వెంకట సుబ్బారావు వయోభారం వల్ల పలు అనారోగ్య సమస్యలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం మరణించారు. దీంతో వేణు కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వేణు తండ్రి వెంకట సుబ్బారావుకు నివాళులు అర్పించారు.

వేణు తండ్రి వెంకట సుబ్బారావు భౌతికకాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉంచారు. మధ్యాహ్నం తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో వెంకట సుబ్బారావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇకపోతే హీరో వేణు ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. హీరో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. అలాగే కొన్ని రోజులకు ముందు ఆయన నటించిన అతిథి వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలైంది.

రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తూ, వెబ్ సిరీస్ చేస్తూ వేణు బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఆయన ఇంట విషాదం నెలకొంది. కాగా స్వయంవరం సినిమాతో వేణు తొట్టెంపూడి హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, చెప్పవే చిరుగాలి వంటి సినిమాలతో వేణు మంచి గుర్తింపు పొందాడు.


Tags:    

Similar News