'Matti Katha' is Streaming on aha : అవార్డ్ విన్నింగ్ మూవీ ‘మట్టి కథ’.. స్ట్రీమింగ్ నేటి నుంచే

Byline :  Veerendra Prasad
Update: 2023-10-13 03:33 GMT

తెలంగాణ నేపథ్యంలో.. వైవిధ్య‌మైన క‌థాంశంతో.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న( 'Matti Katha' is Streaming on aha') మట్టి కథ'.. ఇటీవల రిలీజై సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాసతో, అచ్చమైన పల్లె సినిమాగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మట్టికథ.. మనసుకు హత్తుకునే కథ అంటూ థియేటర్స్లో చూసిన ప్రతీ ఒక్క ప్రేక్షకుడు భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ సంస్కృతి, మానవ బంధాల పరిమళాన్ని, పల్లెల్లో ప్రజల జీవిన విధానాన్ని, భూమే ప్రాణంగా, వ్యవసాయమే జీవనాధారంగా బతికే ప్రజల భావోద్వేగాలను స్పష్టంగా చూపించింది ఈ సినిమా. విడుదలకు ఈ మూవీ అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇండో - ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 9 అవార్డులతో వారెవ్వా అనిపించిందీ సినిమా. తమకు కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. 




 


తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మట్టికథ స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు(అక్టోబ‌ర్ 13) ఉదయం నుంచే స్ట్రీమింగ్ మొదలుకాగా.. నెటిజన్స్, మూవీ లవర్స్ అంతా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్నేహం, ప్రేమ అనే ఎలిమెంట్స్‌తో పాటు బ‌ల‌మైన భావోద్వేగాల‌తో 'మట్టికథ' ను రూపొందించారు డైరెక్టర్ పవన్ కడియాల. మైక్‌ మూవీస్‌ బ్యానర్పై అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సతీశ్ మంజీర సహనిర్మాత. ఈ సినిమాకు సంగీతం స్మరణ్ సాయి అందించారు. సాయినాథ్ సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. పవన్ కడియాల తొలి చిత్రమే అయినా చాలా రియలిస్టిక్‌గా అనుభవమున్న వ్యక్తిలా కథను మలిచారు. అజయ్‌ వేద్‌, అక్షయ్‌ సాయి, రాజు ఆలూరి, బత్తుల తేజ, బల్వీర్ సింగ్, మాయ, రుచిత నిహాని, కనకవ్వ, బలగం సుధాకర్ రెడ్డి, దయానంద్ తమ సహజ నటనతో అదరగొట్టారు. సినిమా అంటే కమర్షియల్ అనే భావనకు వెళ్లకుండా రియాలిటీగా దగ్గరగా మట్టికథను తీసి తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ మూవీ అందించారు మేకర్స్. అచ్చమైన తెలంగాన యాసతో, స్వచ్ఛమైన పల్లె చిత్రాన్ని ఆవిష్కరించినందుకు ఆడియన్స్ మూవీ టీమ్ ను మెచ్చుకుంటున్నారు.  

Full View


 




Tags:    

Similar News