జగపతిబాబు..ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే జగపతి బాబు పేరే ఎక్కువగా వినిపించేది. ఈయన సినిమా వస్తుందంటే చాలు లేడీస్ థియేటర్లకు క్యూలు కట్టేవారు. ఇప్పుడు తన తోటి హీరోలందరూ ఇంకా హీరోలుగా నటిస్తున్నప్పటికీ తన ట్రెండ్‌ను మార్చి ప్రతినాయకుడిగా వరుస సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఫుల్ జోష్‌లో దూసుకెళ్తున్నారు. తనదైన యాక్టింగ్‌తో టాలీవుడ్ స్టైలీష్ విలన్‌గా ప్రత్యేకతను సంపాదించకున్నారు. హీరోలతో సమానంగా ఒక వైపు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూనే..మరోవైపు ఓటీటీల్లో స్ట్రీమ్ అయ్యే వెబ్ సిరీస్‌లలో కనిపిస్తూ దుమ్ముదులుపుతున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తుంటారు. అయితే జగపతిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ చిన్నవాడైనా పెద్ద మనసున్నోడు అంటూ అతడిని పొగడ్తలతో ముంచేశారు.
ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.."రాజమౌళి ఫ్యామిలీ అందరికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా చాలా సింపుల్‌గా ఉంటారు. ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చినా గర్వం అనేది అస్సలు ఉండదు. అందుకే నాకు వారి కుటుంబం అంటే చాలా ఇష్టం. రాజమౌళికి నేను రిలేషన్ అయినప్పటికీ ఎప్పుడూ నాకు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వమని కోరలేదు. అతనూ నన్ను ఓ పాత్ర చేయమని అడగలేదు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఓసారి నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడు ఎవరితో మాట్లాడాలో అర్థంకాలేదు. అప్పుడు మైండ్‌లో ప్రభాస్ కదిలాడు. వెంటనే ప్రభాస్‌కు కాల్ చేశాను. అప్పుడు ప్రభాస్ జార్జియాలో ఉన్నాడు. అయినా నా కాల్ లిఫ్ట్ చేశాడు. డార్లింగ్ మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి అంటూ ధైర్యం చెప్పాడు. తప్పనిసరిగా మీ సమస్యను సాల్వ్ చేస్తా అని అన్నాడు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అది నన్ను ఎంతగానో కదిలించింది. వయసులో నాకన్నా చిన్నవాడైనా ప్రభాస్ గొప్ప మనసుతో నాకు మేలు చేశాడు. నిజానికి అతనికి ఇవ్వడం తప్ప తిరిగి తీసుకునే అలవాటు అస్సలు లేదు". అంటూ ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచేశారు జగపతిబాబు.