ANRCentenary celebrations : జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు

Byline :  Aruna
Update: 2023-09-20 08:36 GMT

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు స్క్రీన్ మీదనే కాదు బయట కూడా పెదరాయుడు లాగానే ఉంటాడన్న సంగతి తెలిసిందే. క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా ఉంటుంది ఆయన ప్రవర్తన. స్టేజ్ మీద ప్రసంగించేప్పుడు కూడా మోహన్ బాబు ఏవిధంగా ఉంటారో చాలా మందికి అనుభవమే. అయితే ఇవాళ హైదరాబాద్‎లోని అన్నపూర్ణ స్టూడియోస్‏లో లెజెండరీ నటుడె అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. అదే విధంగా సీనియర్ నటి జయసుధ, మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.




 


అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలకు వచ్చిన జయసుధ, మోహన్ బాబు ఇద్దరూ కూడా పక్కపక్కనే కూర్చున్నారు. అయితే స్టేజ్ మీద ఎవరో స్పీచ్ ఇస్తుంటే బోర్ కొట్టిందో ఏమోగానీ జయసుధ ఫోన్ చూడటం మొదలుపెట్టారు. ఈ సీన్ చూసిన మోహన్ బాబుకు కోపం వచ్చింది అనుకుంటా, వెంటనే జయసుధ చేతి నుంచి ఫోన్ లాక్కున్నాడు. దీంతో సహజ నటి జయసుధకు కూడా కోపం వచ్చింది అనుకుంటా మోహన్ బాబువైపు సీరియస్ లుక్ ఇచ్చారు. దీంతో ముందు స్పీచ్ విను అన్నట్లు ఆయన లుక్ ఇచ్చారు. ఈ సీనంతా వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇంటివారికే కాదు ఇండస్ట్రీకి మోహన్ బాబు పెదరాయుడే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది వారిద్దరి మధ్య ఉన్న చనువుతోనే అలా చేశారని అందులో తప్పేం లేదని అంటున్నారు.





Tags:    

Similar News