టాలీవుడ్ సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ కెరీర్ తమిళనాట ప్రారంభమైనా టాలీవుడ్లోనే ఆమనికి మంచి గుర్తింపు లభించింది. జంబలకిడిపంబ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆమని వరుస సినిమాలు చేసి అందరిని అలరించింది. అసలు సిసలైన గృహిణి అంటే.. భార్య అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా తన పెర్ఫార్మెన్స్తో సినిమాల్లో మెప్పించింది ఆమని. అప్పట్లో అందాల ఆరబోత లేకుండా కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్న తార ఆమని. మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, జంబలకిడి పంబ, శుభ సంకల్పం లాంటి ఎన్నో మరపురాని సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఓ బిజినెస్ మెన్‌ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఆమని. ఆ తరువాత సినిమాలో బై బై చెప్పేసింది. భర్త కోరికమేరకు కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది.
అయితే చాలా రోజుల తరువాత ఆమని తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో కనిపిస్తున్న ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." కెరీర్ పీక్స్‌లో ఉండగానే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా భర్త ఓ బిజినెస్ మెన్. పెళ్లికి ముందే సినిమాలకు దూరంగా ఉండాలన్న కండీషన్ పెట్టాడు. దానికి నేను ఓకే చెప్పాను. కానీ ఇప్పుడు ఆ కండీషన్‌కి నేనె ఎలా ఒప్పుకున్నాను అని అనిపిస్తుంది"అని తన భర్త పెట్టిన కండీషన్‌ను రివీల్ చేసింది ఆమని. కానీ ఆ తర్వాత తన భర్త సపోర్ట్ తోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానని తెలిపింది.