Singer Pankaj Udhas : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ సింగర్ కన్నుమూత!
Byline : Shabarish
Update: 2024-02-26 11:37 GMT
సినీ పరిశ్రమలో్ విషాదం నెలకొంది. స్టార్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. గజల్ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పంకజ్ ఉదాస్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మరణించారు. 72 ఏళ్ల ఉదాస్ మరణవార్తను ఆయన కుమార్తె నయాబ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంకజ్ ఉదాస్ మరణవార్తను కుమార్తె నయాబ్ చెబుతూ ఓ నోట్‌ను పోస్ట్ చేశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఫిబ్రవరి 26వ తేదిన పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించినట్లు తెలియజేయడానికి చింతిస్తున్నామని ఆమె తన నోట్‌లో రాసుకొచ్చారు. ఆయన మరణవార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.