త్రిషను వదలనంటోన్న స్టార్ హీరో..ఆ మూవీలో స్పెషల్ రోల్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ మధ్యనే ఆయన ఓ పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశాడు. దీంతో సైన్ చేసిన ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది గోట్' అనే మూవీని షూట్ చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీలోకి మరో స్టార్ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనుందట.
'ది గోట్' మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష ఓ స్పెషల్ రోల్ చేస్తుందట. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆ మధ్య 'లియో' మూవీలో విజయ్ సరసన త్రిష నటించింది. చాలా ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ ఆ సినిమాలో జోడీ కట్టారు. ఆ మూవీ తర్వాత త్రిషను విజయ్ మర్చిపోలేకపోతున్నారట. అందుకే తన నెక్ట్స్ మూవీలో కూడా ఆమెను ఏదోక రకంగా ఉండేలా చూడాలనుకుంటున్నాడట.
త్రిషతో ఓ స్పెషల్ రోల్ చేయించేందుకు విజయ్ తన డైరెక్టర్‌ని కూడా రిక్వెస్ట్ చేశాడట. ఇదంతా తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. అయితే ఈ మూవీలో త్రిష నటిస్తుందా? లేదా? అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మూవీ 'విశ్వంభర'లో త్రిష నటించనుంది. ఈ చెన్నై బ్యూటీ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది.