తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన త్రిష. అయితే మధ్యలో కొన్ని హిట్లు, ఫ్లాప్ లు రావడంతో ఇండస్ట్రీలో అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపాయి. అలాంటి టైంలో మణిరత్నం తన డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ లో అవకాశం ఇచ్చాడు. యువరాణి కుందవై పాత్రలో ఒదిగిపోయిన త్రిష.. ఈ సినిమా ద్వారా కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో అవకాశాలు దక్కాయి. విజయ్, అజయ్ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. సోలో పాత్రలో నటించిన ది రోడ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో త్రిష చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 10 ఏళ్ల క్రితం డైరెక్టర్ సెల్వరాఘవన్ ట్వీట్ కు తాజాగా రిప్లై ఇచ్చింది త్రిష. 2013లో సైల్వరాఘవన్ డైరెక్షన్ లో వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఆ సినిమా విడుదలైన తర్వాత సెల్వ ట్విట్టర్ ద్వారా.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకు సీక్వెల్ తీయాలనే ప్లాన్ ఉన్నట్లు తెలిసింది. అదే విషయాన్ని త్రిషకు చెప్పగా దానికి ఇప్పుడు ఒప్పుకుంది. సీక్వెల్ కు తాను రెడీ అని పోస్ట్ పెట్టింది. అయితే దీనికి సెల్వ నుంచి రిప్లై రావాల్సి ఉంది.
I’m ready @selvaraghavan 😝 https://t.co/9DCojSHe3u
— Trish (@trishtrashers) September 10, 2023